మెడ చుట్టూ నలుపు తొలగించుకోండిలా

- July 17, 2015 , by Maagulf
మెడ చుట్టూ నలుపు తొలగించుకోండిలా

కాలుష్యం, మురికి, వయసు మీద పడడంలాంటి కారణాల వల్ల మెడ భాగం నల్లగా మారి ముడతలు కూడా పడుతుంది. ఇది పోవాలంటే విటమిన్‌ సి ఉన్న పళ్లను ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మకాయ చెక్కకు ఉప్పుగానీ పంచదార గానీ రాసి దాంతో సున్నితంగా మెడను మర్దన చేసుకోవడం వల్ల క్రమంగా మెడ నలుపు పోతుంది. కీర దోస గుజ్జును మెడ భాగంలో రాసి పదిహేను నిముషాలు రుద్దితే మంచి ఫలితం ఉంటుంది. పాల మీగడకు చర్యాన్ని తెల్లగా మార్చే లక్షణం ఉంటుంది. కాబట్టి మీగడలో కొద్దిగా పసుపు కలిపి మెడకు పట్టించి కొద్దిసేపయ్యాక స్నానం చేయాలి. కలబంద గుజ్జుతో మర్దన చేసినా మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ మీది సున్నితమైన చర్మం అయితే గులాబీ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి దూదితో సున్నితంగా తుడవడం వల్ల కూడా మెడ నలుపు పోతుంది.కమలా ఫలాల తొక్కల పొడిలో కొద్దిగా పాలు పోసి పేస్ట్‌లా చేసి మెడకి పట్టించి, ఆరాక కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com