అల్-సబాహియాలో లూనా పార్క్ ప్రారంభం..!!
- October 24, 2025
కువైట్: దక్షిణ అల్-సబాహియాలో లూనా పార్క్‌ను టూరిస్టిక్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ (TEC) ప్రారంభించింది. అన్ని వయసుల వారికి ఇది ఒక ఆకర్షణీయ ప్రాంతంగా ఉంటుందని తెలిపారు. ఈ పార్క్ లో పెద్దలు మరియు పిల్లల కోసం 50 కి పైగా రైడ్లు, 13 స్కిల్ గేమ్‌లు ఉన్నాయని అధికారిక ప్రతినిధి అబ్దుల్లా అల్-రఫీ తెలిపారు. ప్రసిద్ధ రెస్టారెంట్లు, కేఫ్‌లు, చైనీస్ మార్కెట్ మరియు లూనా బజార్ వంటి స్టాల్స్ ఉన్నాయని అన్నారు. ప్రతి రోజు పిల్లల కోసం ప్రత్యేక ప్రదర్శనలు, ఫైర్ వర్క్స్ ఉంటాయని తెలిపారు.
టూరిస్టిక్ ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్ ద్వారా లేదా ఆన్-సైట్ టికెట్ విండోలో టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చని అల్-రఫీ వివరించారు. ప్రవేశ రుసుము రెండు కువైట్ దినార్లు, ఇందులో పిల్లలకు 20 రైడ్లు ఉంటాయని, వికలాంగులకు ప్రవేశం ఉచితమని తెలిపారు. ఈ పార్క్ ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు ఉంటుంది. ప్రారంభోత్సవంలో TEC సీఈఓ అన్వర్ అల్-హులైలా మరియు అనేక కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







