మహబౌలాలో భద్రతా క్యాంపెయిన్..263 మంది అరెస్టు..!!

- October 26, 2025 , by Maagulf
మహబౌలాలో భద్రతా క్యాంపెయిన్..263 మంది అరెస్టు..!!

కువైట్ః  మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్-సబా ప్రత్యక్ష పర్యవేక్షణలో మహబౌలా ప్రాంతంలో సమగ్ర భద్రతా క్యాంపెయిన్ ను నిర్వహించారు. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఆపరేషన్ ఫలితంగా నివాస మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారితో సహా వివిధ నేరాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న  263 మందిని అరెస్టు చేసినట్టు పబ్లిక్ భద్రతా వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ హమీద్ మనాహి అల్-దవాస్ తెలిపారు. షేక్ ఫహద్ అల్-యూసెఫ్ చట్టాలను ఉల్లంఘించిన వారిపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com