ఆశిష్‌రాజు 'ఆకతాయి' ప్రారంభం!

- July 23, 2016 , by Maagulf
ఆశిష్‌రాజు 'ఆకతాయి' ప్రారంభం!

 రాం భీమన దర్శకత్వంలో ఆశిష్‌రాజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ఆకతాయి'. వి.కె.ఎ. ఫిలింస్‌ పతాకంపై కె.ఆర్‌ విజయ్‌కరణ్‌, కె.ఆర్‌.కౌషల్‌కరణ్‌, కె.ఆర్‌. అనిల్‌కరణ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఆకతాయిగా తిరిగే ఓ అల్లరి కుర్రాడి జీవితంలో అనుకోకుండా ఓ సంఘటన జరుగుతుంది. అది ఏమిటి? దాని నుంచి అతను ఎలా బయటపడ్డాడు. అనేది కథని తెలిపారు. ఈ చిత్రంలో తన పాత్రను ఓ సవాల్‌గా తీసుకుని నటిస్తున్నట్లు కథానాయకుడు ఆశిష్‌రాజు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com