ఉమ్రా వీసా వ్యాలిడిటీని తగ్గించిన సౌదీ అరేబియా..!!
- October 31, 2025 
            రియాద్ : సౌదీ అరేబియా ఉమ్రా ఎంట్రీ వీసా వ్యాలిడిటీని తగ్గించింది. ఉమ్రా కోసం ఎంట్రీ వీసా చెల్లుబాటు వ్యవధిని జారీ చేసిన తేదీ నుండి మూడు నెలల నుండి ఒక నెలకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సౌదీ అరేబియాకు యాత్రికుడు వచ్చిన తర్వాత ఉండటానికి చెల్లుబాటు వ్యవధి మూడు నెలలుగానే ఉందని, ఇందులో మార్పులు లేవని హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
మరోవైపు జూన్ నుంచి కొత్త ఉమ్రా సీజన్ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు విదేశీ యాత్రికులకు జారీ చేసిన ఉమ్రా వీసాల సంఖ్య నాలుగు మిలియన్లు దాటింది. ఈ సంవత్సరం ఉమ్రా సీజన్ గత సీజన్లతో పోలిస్తే కేవలం ఐదు నెలల్లోనే విదేశీ యాత్రికుల సంఖ్యకు రికార్డు సృష్టిస్తోంది.
సవరించిన నిబంధనల ప్రకారం యాత్రికుడు సౌదీ అరేబియాలోకి ప్రవేశించడానికి నమోదు చేసుకోకపోతే ఉమ్రా వీసా జారీ చేసిన తేదీ నుండి 30 రోజుల తర్వాత రద్దు చేయబడుతుందని తెలిపింది. కొత్త నిబంధనలు వచ్చే వారం నుండి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈసారి ఉమ్రా యాత్రికుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఉమ్రా జాతీయ కమిటీ సలహాదారు అహ్మద్ బజాయీఫర్ తెలిపారు.
తాజా వార్తలు
- వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- సౌదీ అరేబియా ఆదాయం SR270 బిలియన్లు..!!
- KD 170,000 విలువైన డ్రగ్స్ సీజ్.. ప్రవాసుడు అరెస్టు..!!
- మస్కట్ లో ఎయిర్ కండిషనర్ల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- 'రన్ ఫర్ యూనిటీ'లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి
- సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ..







