తగ్గిన బంగారం ధర

- July 23, 2016 , by Maagulf
తగ్గిన బంగారం ధర

బంగారం ధర నేడు చాలా స్వల్పంగాతగ్గింది. నేటి బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల పసిడి రూ.20 తగ్గి రూ.30,750కి చేరింది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ తగ్గినట్లు మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. ఈరోజు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కేజీ వెండి ధర రూ.75 తగ్గి రూ.46,125కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి వెండికి డిమాండ్‌ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర కాస్త పడిపోయింది. న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,322.10 అమెరికా డాలర్లు ఉండగా ఔన్సు వెండి ధర 19.59 డాలర్లు ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com