‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్‌వేస్..!!
- November 01, 2025
లండన్: ఖతార్ ఎయిర్‌వేస్ ప్రతిష్టాత్మక బిజినెస్ ట్రావెలర్ అవార్డ్స్ 2025లో మెరిసింది. ‘ప్రపంచంలోని ఉత్తమ విమానయాన సంస్థ’గా ఎంపికైంది. ఎయిర్‌లైన్ మెయింటనెన్స్, కొత్త ఆవిష్కరణలు మరియు ప్రపంచ స్థాయి సేవలకు గాను గుర్తింపు పొందింది. లండన్‌లోని ఐకానిక్ స్కై గార్డెన్‌లో బిజినెస్ ట్రావెలర్ అవార్డుల వేడుక జరిగింది.
ఖతార్ ఎయిర్‌వేస్ ప్రపంచంలోనే అత్యుత్తమ బిజినెస్ క్లాస్, ప్రపంచంలోనే అత్యుత్తమ ఎకానమీ క్లాస్,ప్రపంచంలోనే అత్యుత్తమ ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ ప్రోగ్రామ్, ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌లైన్ లాంజ్,యూరప్ మరియు మిడిల్ ఈస్ట్ మధ్య అత్యుత్తమ ఎయిర్‌లైన్ గా అవార్డులను అందుకుందని ఖతార్ ఎయిర్‌వేస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ థియరీ ఆంటినోరి వెల్లడించారు. ప్రతిష్టాత్మక అవార్డులను అందుకోవడం తమకు గర్వకారణంగా ఉందని తెలిపారు.
ఈ సంవత్సరం బిజినెస్ ట్రావెలర్ అవార్డులలో ఖతార్ ఎయిర్‌వేస్ అద్భుతంగా రాణించిందని ఇంక్ గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ మైఖేల్ కీటింగ్ తెలిపారు. ఖతార్ ఎయిర్‌లైన్ ప్రపంచవ్యాప్తంగా 170 కి పైగా గమ్యస్థానాలతో తన ప్రపంచ నెట్‌వర్క్ కలిగి ఉందని వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్‌వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







