మంత్రి హరీశ్‌రావు రేపు జపాన్ పర్యటనకు..
- July 23, 2016
రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సోమవారం జపాన్ దేశానికి వెళుతున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, పలువురు ఇంజినీర్లు కూడా వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పంపులు జపాన్ దేశంలో రూపొందుతున్నాయి. దీంతో వాటి మోడల్ ను పరిశీలించేందుకు మంత్రి హరీష్ రావుతోపాటు అధికారుల బృందం జపాన్ దేశానికి వెళుతున్నారు. అలాగే ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించిన పంపులు ఆస్ట్రియా దేశంలో రూపొందుతుండగా అక్కడకు కూడా వెళ్లి వాటిని కూడా పరిశీలించనున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







