'గుమ్మడి నర్సయ్య' బయోపిక్ ప్రధాన పాత్రలో డా.శివ రాజ్ కుమార్....

- November 06, 2025 , by Maagulf
\'గుమ్మడి నర్సయ్య\' బయోపిక్ ప్రధాన పాత్రలో డా.శివ రాజ్ కుమార్....

భారతీయ సినీ చరిత్రలో ఒక వ్యక్తి జీవిత చరిత్రను తెరపైకి తీసుకురావాలంటే ఎంతో పరిశోధన, ధైర్యం అవసరం. మాజీ ఎమ్మెల్యే, నిజాయితీకి, నిరాడంబరతకు మారుపేరైన గుమ్మడి నర్సయ్య గారి లాంటి వ్యక్తి చరిత్రను వెండితెరపై ఆవిష్కరించడం ఒక సాహసం అనే చెప్పాలి. ఆ సాహసాన్ని యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరమేశ్వర్ హివ్రాలే భుజానికెత్తుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ తరుపున నిర్మాత ఎన్. సురేష్ రెడ్డి గారు అండగా నిలబడ్డారు.

గుమ్మడి నర్సయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజానాయకుడు, నిజాయితీకి మారుపేరైన నాయకుడు. ఆయన రాజకీయాలు చేయడానికి కారణం అధికారాన్ని పొందడం కాదు, ప్రజల సమస్యలను పరిష్కరించడం. 1940ల కాలంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మల్లంపల్లి గ్రామంలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచే సామాజిక చైతన్యం కలిగిన వ్యక్తిగా ఎదిగారు. రైతు కుటుంబంలో పుట్టి, భూమి పట్ల, పేదల జీవన విధానాల పట్ల ఉన్న అనుభవమే ఆయనను ప్రజల పక్షాన నిలబడే వ్యక్తిగా మలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com