‘కాంత’ ట్రైల‌ర్‌ విడుదల

- November 06, 2025 , by Maagulf
‘కాంత’ ట్రైల‌ర్‌ విడుదల

మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టిస్తున్న మూవీ కాంత‌. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ల‌క్కీ భాస్క‌ర్ చిత్రం త‌రువాత దుల్క‌ర్ న‌టిస్తున్న స్ట్ర‌యిట్ చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. భాగ్యశ్రీ బోర్సే క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

సముద్రఖని, రానా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా న‌వంబ‌ర్ 14న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఊదిపడేయడానికి నేను మట్టిని కాదు.. పర్వతాన్ని. అంటూ దుల్కర్ చెప్పిన‌ డైలాగులు బాగున్నాయి. మొత్తంగా ట్రైల‌ర్‌తో ఈ సినిమా ఉన్న అంచ‌నాలు అమాంతంగా పెరిగిపోయాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com