బహ్రెయిన్‌లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!

- November 17, 2025 , by Maagulf
బహ్రెయిన్‌లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!

మనామా: బహ్రెయిన్‌లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్ కానున్నాయి. వీసా ట్రాన్స్ ఫర్ ఫీ వసూలు, రెసిడెన్సీ రద్దుల కోసం ఇంటీరియర్ మినిస్ట్రీ, నేషనల్ పాస్ పోర్ట్ మినిస్ట్రీ, లేబర్ మార్కెట్ అథారిటీ కొత్త చట్టంపై సంతకాలు చేశాయి.   

ప్రభుత్వ సంస్థలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి, మెరుగైన సేవలను మెరుగుపరచడానికి కొత్త చట్టం సహకరిస్తుందని ఆయా మినిస్ట్రీస్ ప్రతినిధులు పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతమైన, మరింత ఈజీగా సేవలను అందిస్తుందని పేర్కొన్నారు. అలాగే, సేవల్లో నాణ్యతను పెంచడానికి, మరింత పారదర్శకతను పెంచడానికి దోహదం చేస్తుందన్నారు. ఇది ప్రభుత్వ పనితీరును మెరుగు పరచడానికి అధునాతనమైన డిజిటల్ వ్యవస్థలను అందిస్తుందని వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com