ఆగష్టు 5 న విడుదల కానున్న 'మరల తెలుపనా ప్రియా`

- July 24, 2016 , by Maagulf
ఆగష్టు 5 న విడుదల కానున్న 'మరల తెలుపనా ప్రియా`

ప్రిన్స్‌, వ్యోమనంది, పూజా రామచంద్రన్‌ లు హీరో హీరోయిన్లుగా శ్రీ చైత్ర చలన చిత్ర నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రం 'మరల తెలుపనా ప్రియా`. ఈ చిత్రం ఆగస్ట్ 5 న విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా దర్శకురాలు వాణి.యం.కొసరాజు మాట్లాడుతూ.ఇది స్వచ్చమైన ప్రేమకథ. శేఖర్ చంద్రగారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇటీవల విడుదల అయిన ఆడియో కి చాలా మంచి స్పందన వచ్చింది. చాలా ఓపికగా మంచి సంగీతాన్ని ఇచ్చిన శేఖర్ చంద్ర గారికి, చక్కని సాహిత్యాన్నిఅందించిన లిరిక్ రైటర్స్ కు నా ధన్యవాదాలు. ఇది ఓ విభిన్నమైన ప్రేమకథా చిత్రం. భిన్నమైన వ్యక్తిత్వాలు నేపధ్యాలున్న అమ్మాయి, అబ్బాయిల మద్య సాగే ప్రేమకథ ఇది. ఇప్పుడు అమ్మాయిలు కూడా ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్నారని అనుకుంటున్నారు. స్త్రీ అయిన నాకే అది నచ్చలేదు. స్త్రీ, పురుషులెవరైనా ప్రేమ స్వచ్చంగానే ఉండాలి. అవసరమైతే ప్రేమ కోసంఅమ్మాయిలు కూడా త్యాగాలు చేస్తారు. ఈ విషయాన్నే నేను సినిమాగా చూపిస్తున్నాను. సినిమా బాగా వచ్చింది. ఆగస్ట్ 5 న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. మా ఈ ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.. అన్నారు.
ప్రిన్స్‌, వ్యోమనంది, పూజా రామచంద్రన్‌, సుజో మ్యాథ్యూ, సమీర్‌, సన, రవివర్మ, పావనీ రెడ్డి, ఈ రోజుల్లో ఫేమ్‌ సాయి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, ఆర్ట్‌: పి.యస్‌. వర్మ, ఫైట్స్‌: సతీష్‌, కెమెరా: ఎస్‌. రాజశేఖర్‌, ఎడిటర్‌: మార్తాండ్‌. కె. వెంకటేష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: కె. సురేష్‌బాబు, శ్రీనివాస్‌ వుడిగ, నిర్మాణం: శ్రీ చైత్ర చలన చిత్ర, కథ-స్క్రీన్‌ప్లే-డైలాగ్స్‌-దర్శకత్వం: వాణి. ఎమ్‌. కొసరాజు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com