టీడీపీ నేత రేవంత్ రెడ్డి పోలీసులు అదుపులో

- July 25, 2016 , by Maagulf
టీడీపీ నేత రేవంత్ రెడ్డి పోలీసులు అదుపులో

టీటీడీపీ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లన్న సాగర్ నిర్వాసితులపై పోలీసులు లాఠీఛార్జీ జరపడంపై విపక్షాలు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.బంద్‌తో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. జిల్లాలోని పలు చోట్ల కాంగ్రెస్‌, వామపక్షాలు, టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. గజ్వేల్ వద్ద ఆందోళనకు దిగిన టీటీడీపీ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అరెస్టు చేసిన అనంతరం రేవంత్ రెడ్డిని పోలీసులు దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అలాగే , ఈ బంద్ కు మద్దత్తు తెలపడానికి వచ్చిన తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com