సల్మాన్‌ఖాన్‌కు వూరట..
- July 25, 2016
వన్య ప్రాణులను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు వూరట లభించింది. ఈ కేసులో సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ.. రాజస్థాన్ హైకోర్టు తీర్పు చెప్పింది.
1998లో హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ కోసం సల్మాన్ రాజస్థాన్ వెళ్లారు. ఆ సమయంలో జోధ్‌పూర్ శివారులోని అటవీ ప్రాంతంలో సల్మాన్ అక్రమంగా రెండు కృష్ణజింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు అతడిపై రెండు కేసులు నమోదు చేశారు. దీనిపై విచారించిన జోధ్‌పూర్ కోర్టు.. రెండు కేసుల్లోనూ ఏడాది, ఐదేళ్లపాటు జైలు శిక్ష విధించింది. అయితే స్థానిక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. రాజస్థాన్ హైకోర్టులో సల్మాన్ పిటిషన్ దాఖలు చేశారు. మే చివరి వారంలోనే ఈ కేసుకు సంబంధించి వాదనలు పూర్తి కాగా.. తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో పెట్టింది. ఈ కేసులో సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ.. హైకోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది.
తాజా వార్తలు
- సలాలాలో ఒమన్-బహ్రెయిన్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఎగ్జిబిషన్ సెంటర్లో 'ఈడబ్ల్యూబీ కలినేర్' సేవలు..!!
- కావేరి జలాల వివాదం.. సీఎం విజయ్ ముందున్న తొలి రాజకీయ సవాల్
- 2026 తొలి ఆరు నెలల్లో ఒమన్‌లో తగ్గిన జననాలు, మరణాలు..!!
- అట్టహాసంగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్!
- 75 రోజుల పాటు బురైదా అంతర్జాతీయ డేట్స్ ఫెస్టివల్..!!
- గాలిలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు..ఇద్దరు పైలట్లు మృతి
- మెట్రాష్ యాప్‌తో సీఐడీకి గోప్యంగా సమాచారం అందించే అవకాశం..!!
- భారత్ లో ఒక్కో యూజర్ నెలకు 50 గంటలు ఇన్స్టాలోనే!
- సెప్టెంబర్‌లో రోజుకు 1.88 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంపు..!!







