సరిహద్దులను మార్చడానికి ఏ దేశం బలప్రయోగం చేయకూడదు..జీ20 ప్రకటన

- November 23, 2025 , by Maagulf
సరిహద్దులను మార్చడానికి ఏ దేశం బలప్రయోగం చేయకూడదు..జీ20 ప్రకటన

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 వార్షిక సదస్సులో సభ్య దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి.అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సరిహద్దులను మార్చడానికి ఏ దేశం బలప్రయోగం లేదా బెదిరింపులను ఉపయోగించకూడదని ఒక ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. ఇది సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు ప్రపంచ నిబద్ధతను స్పష్టంగా పునరుద్ఘాటిస్తుంది.

ఈ ప్రతిపాదనకు అమెరికా అభ్యంతరాలను తెలిపింది.అయినప్పటికీ మిగా జీ20 దేశాలు దీనిని సంపూర్తిగా అంగీకరించాయి.ఈ ఉమ్మడి ప్రకటన లో ఉగ్రవాదం దాని అన్ని రూపాలు, వ్యక్తీకరణలను ఖండించారు. అలాగే జాతి, లింగం, భాష, మతాలతో సంబంధం లేకుండా మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛల పట్ట విస్తృత గౌరవాన్ని ఆశించారు. ఈ ప్రకటన ప్రపంచంలో తీవ్రతరం అవుతున్న భౌగోళిక, రాజకీయ చీలికలు, సాయుధ పోరాటాలు, ఆర్థిక విచ్ఛిన్నంపై ఆందోళనను ప్రతిబింబిస్తుంది.

దాంతో పాటూ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం లేదా రాజకీయ స్వాతంత్రానికి వ్యతిరేకంగా ప్రాదేశిక సముపార్జనను కోరుకునే ఏ దేశం అయినా బెదిరింపు లేదా బలప్రయోగం నుండి ప్రపంచ దేశాలు దూరంగా ఉండాలని నొక్కి చెబుతోంది. దౌత్యవేత్తలు దీనిని రష్యా, ఇజ్రాయెల్ మరియు మయన్మార్‌లకు ఒక అవ్యక్త సంకేతంగా అర్థం చేసుకున్నారు.

G20 మానవతా చట్టాల సూత్రాలకు కట్టుబడి ఉంది
ప్రపంచ అస్థిరత, పెరుగుతున్న భౌగోళిక-ఆర్థిక పోటీ, విస్తరిస్తున్న అసమానతలు సమ్మిళిత వృద్ధికి ముప్పు కలిగిస్తున్నాయని డిక్లరేషన్ పేర్కొంది. దాంతో పాటూ అంతర్జాతీయ చట్టానికి,వివాదాల శాంతియుత పరిష్కారానికి కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటిస్తూ.. G20 ఐక్యరాజ్యసమితి చార్టర్ ,అంతర్జాతీయ మానవతా చట్టాల సూత్రాలకు కట్టుబడి ఉందని తెలిపింది.

అలాగే విపత్తుల వల్ల దెబ్బ తిన్న చిన్న ద్వీప దేశాలూ, తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు మద్దుతు ఇవ్వాలని జీ20 దేశాలు నిర్ణయించాయి. ఆహార భద్రతపై, ప్రతి వ్యక్తికి ఆకలి నుండి విముక్తి పొందే హక్కు ఉందని G20 పునరుద్ఘాటించింది.వీటన్నిటితో పాటూ డిజిటల్ ,కృత్రిమ మేధస్సుతో సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు అందించే అవకాశాన్ని నాయకులు గుర్తించారు.

ఈ సాధనాలను ప్రజా శ్రేయస్సు కోసం సమానమైన రీతిలో ఉపయోగించుకోవాలని అన్నారు. దక్షిణాఫ్రికా అంతర్జాతీయ సంబంధాల మంత్రి రోనాల్డ్ లామోలా ఈ ప్రకటనను ఆమోదించడాన్ని “ఒక గొప్ప క్షణం” అని అభివర్ణించారు.ఇది ఆఫ్రికన్ ఖండానికి గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com