ఆగష్టు 5న విడుదల కానున్న 'చుట్టాలబ్బాయి'

- July 25, 2016 , by Maagulf
ఆగష్టు 5న విడుదల కానున్న 'చుట్టాలబ్బాయి'

ఆది హీరోగా వీరభద్రం దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి నిర్మించిన చిత్రం 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైనట్లు చిత్ర బృందం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. 'ఆది, వీరభద్రం కాంబినేషన్లో చక్కని కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న మా చుట్టాలబ్బాయి చిత్రాన్ని ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. ఈ వారంలో ప్లాటీనం డిస్క్‌ ఫంక్షన్‌ను నిర్వహించనున్నాం. అహ నా పెళ్ళంట, పూలరంగడు చిత్రాల తర్వాత వీరభద్రం రూపొందిస్తున్న మరో సూపర్‌హిట్‌ చిత్రమిది' అన్నారు.
ఈ చిత్రంలో ఆది సరసన నమిత ప్రమోద్‌ నటించారు. సాయికుమార్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, రఘుబాబు, కృష్ణభగవాన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థమన్‌ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com