ఐసిస్‌ వైపు యువకులను ప్రేరేపించిన నిందితుడిపై ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌

- July 25, 2016 , by Maagulf
ఐసిస్‌ వైపు యువకులను ప్రేరేపించిన నిందితుడిపై ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ వైపు హైదరాబాద్‌ యువకులను ప్రేరేపించిన నిందితుడిపై జాతీయ దర్యాప్తు బృందం ఛార్జిషీట్‌ నమోదుచేసింది. కర్ణాటకలోని భత్కల్‌కు చెందిన అద్నన్‌ హసన్‌పై దిల్లీలో ఎన్‌ఐఏ ఛార్జిషీట్‌ రూపొందించింది. అబ్దుల్లా బాసిత్‌, ఉమర్‌ ఫరూకీ, జమీర్‌ ఫరూకీలను ప్రేరేపించి వారు సిరియా వెళ్లేందుకు హసన్‌ నిధులు సమకూర్చినట్లు ఎన్‌ఐఏ అధికారులు నిర్థరించారు. బాసిత్‌, ఉమర్‌ ఫరూకీలు సిరియాకు వెళ్లేందుకు రెండుసార్లు ప్రయత్నించి చిక్కారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com