సౌదీ అరేబియాలోని 1.7 మిలియన్ల వృద్ధులు..!!
- November 29, 2025
రియాద్: సౌదీ అరేబియాలో 60 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి సంఖ్య దాదాపు 1.7 మిలియన్లకు చేరుకుంది. మొత్తం జనాభాలో వీరు 4.8 శాతానికి సమానం అని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) గణంకాలు తెలిపాయి. వృద్ధులలో సౌదీలు 69 శాతం ఉన్నారు. మొత్తం వృద్ధులలో పురుషులు 57 శాతం, మహిళలు 43 శాతం ఉన్నారు.
వృద్ధులలో జీవిత సంతృప్తి చాలా ఎక్కువగా ఉందని, పురుషులు మరియు మహిళలు ఇద్దరూ దాదాపు 91 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని సర్వేలో తేలిందన్నారు. దాదాపు 7 శాతం మంది ఏ వివరాలు చెప్పలేదు. కేవలం 2 శాతం మంది మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేశారని నివేదిక వెల్లడించింది.
ఇక 60-64 ఏళ్ల వయస్సులో వ్యాయామం చేసే వారి శాతం సుమారు 42.6 శాతంగా ఉంది. అలాతే, 65-69 ఏళ్ల వయస్సులో 36.1 శాతానికి, తరువాత 70-74 ఏళ్ల వయస్సులో 24.2 శాతానికి పడిపోయింది. 85 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిలో 9.6 శాతానికి చేరుకుంది.
సౌదీ వృద్ధ పురుషులలో 40.6 శాతం మంది తమ రోజువారీ పనులు చేసుకుంటున్నారని సర్వే ఫలితాలు వెల్లడించాయి. అయితే 30.9 శాతం మంది తమ పిల్లలపై మరియు 25.8 శాతం మంది తమ జీవిత భాగస్వాములపై ఆధారపడుతున్నారు. వృద్ధ మహిళలలో 40.9 శాతం మంది తమ పిల్లలపై, 36.5 శాతం మంది స్వయంగా, 5.7 శాతం మంది తమ భర్తలపై ఆధారపడుతున్నారు.
వృద్ధులలో డిజిటల్ ఇంటిగ్రేషన్ విషయానికొస్తే, వృద్ధ పురుషులలో 86.9 శాతం మంది స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌ను ఉపయోగిస్తున్నారు. వృద్ధ మహిళలలో 78 శాతం మంది స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌ను ఉపయోగిస్తున్నారని సర్వేలో తేలింది. సేవలను యాక్సెస్ చేయడానికి లేదా పనులు చేయడానికి టెక్నాలజీని ఉపయోగించే విషయంలో పురుషులు 75.7 శాతం మరియు మహిళలు 58.7 శాతం శాతంగా ఉందని నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







