‘డిఫీట్ డయాబెటిస్’ సైక్లోథాన్.. కమ్యూనిటీ ర్యాలీస్ ఫర్ వెల్నెస్..!!

- December 01, 2025 , by Maagulf
‘డిఫీట్ డయాబెటిస్’ సైక్లోథాన్.. కమ్యూనిటీ ర్యాలీస్ ఫర్ వెల్నెస్..!!

మనామా: బహ్రెయిన్ సైక్లింగ్ అసోసియేషన్‌తో కలిసి అల్ హిలాల్ హెల్త్‌కేర్ గ్రూప్ మరియు జెటూర్ బహ్రెయిన్ వార్షిక “డిఫీట్ డయాబెటిస్” సైక్లోథాన్ ఐదవ సీజన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఇది బహ్రెయిన్‌లో డయాబెటిస్‌కు వ్యతిరేకంగా కమ్యూనిటీని ఒక్క చోటకు చేర్చింది.డయాబెటిస్ అవగాహన మంత్ లో భాగంగా రేసును నిర్వహించారు.పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ కమ్యూనిటీ ఈవెంట్ లో 800 మందికి పైగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా హాజరైనవారందరూ డయాబెటిస్ కు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.

జల్లాక్‌లోని NBH లూప్ E వద్ద అధికారికంగా ఉదయం 7:30 గంటలకు రిజిస్ట్రేషన్‌తో కార్యక్రమం ప్రారంభమైంది.సైక్లోథాన్‌ను అల్ హిలాల్ హెల్త్‌కేర్ గ్రూప్ సీఈఓ డాక్టర్ శరత్ చంద్రన్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు మరియు కమ్యూనిటీ లీడర్లు పాల్గొన్నారు.ఈ రేసులో పాల్గొన్నవారందరికి హెల్త్ చెకింగ్ కూపన్లు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు, ఈవెంట్ టీ-షర్టులు,రిఫ్రెష్‌మెంట్‌లు మరియు ప్రత్యేకమైన ఆరోగ్య సంరక్షణ డిస్కౌంట్ వోచర్‌లు మరియు బహుమతులు అందజేశారు.

    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com