ఫార్ములా 1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ ముగింపు..అమీర్ హాజరు..!!

- December 01, 2025 , by Maagulf
ఫార్ములా 1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ ముగింపు..అమీర్ హాజరు..!!

దోహా: ఫార్ములా 1 ఖతార్ ఎయిర్‌వేస్ ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025 అట్టహాసంగా ముగిసింది. ముగింపు వేడుకలకు అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ హాజరయ్యారు. ఖతార్ మోటార్ అండ్ మోటార్ సైకిల్ ఫెడరేషన్ (QMMF) ఆదివారం సాయంత్రం లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో నిర్వహించిన ఫైనల్ రేసును తిలకించారు.  ఫార్ములా 1 డ్రైవర్లను ఎంకరేజ్ చేశారు.వేలాది మంది రేసింగ్ ప్రియులతో లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌ కిక్కిరిసిపోయింది.  

ఫార్ములా 1 ఖతార్ ఎయిర్‌వేస్ ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025 ముగింపు వేడుకలకు అమీర్ తోపాటు టాటర్‌స్తాన్ రిపబ్లిక్ అధ్యక్షుడు హెచ్‌ఈ రుస్తం మిన్నిఖానోవ్, ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి హెచ్‌ఈ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రెహ్మాన్ బిన్ జాసిమ్ అల్-థానీలతోపాటు అనేక మంది మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com