అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ పై నిపుణుల హెచ్చరిక..!!
- December 03, 2025
మనామా: ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు (UPFలు) పెరుగుదలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఫుడ్ అతి వినియోగం ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోందని నిపుణులు హెచ్చరించారు. ఈ మేరకు ది లాన్సెట్‌లో ఇటీవల ఒక నివేదికను ప్రచురించారు.
అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ అనేవి విస్తృతమైన ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్‌కు గురయ్యే ఫుడ్ ఉత్పత్తులు. వీటిలో రుచి పెంచేందుకు ఆర్టిఫిషియల్ కలర్స్, స్వీటెనర్లు వంటివి వాడతారు. వీటిల్లో సాధారణంగా షుగర్ డ్రింక్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, ఇన్స్టంట్ నూడుల్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ ఆహారాలు వివిధ ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటాయని, వీటిల్లో పోషకాలు ఉండవని, వీటి అతి వినియోగం శరీరానికి హాని కలిగించే రసాయనాలను కలిగి ఉంటాయని నివేదికలో ఆరోగ్య రంగ నిపుణులు హెచ్చరించారు.
ఈ అధ్యయనం ప్రకారం అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ ల వినియోగం పెరిగే కొద్ది డయాబెటిస్, గుండె జబ్బులు మరియు ఇతర జీవనశైలి వ్యాధుల బారిన పడే అవకాశాన్ని పెంచుతుంది. దీంతోపాటు అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ వాటి ఉత్పత్తి మరియు ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్ వాడకం కారణంగా పర్యావరణానికి కూడా హానికరమని హెచ్చరించారు.
అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించడానికి మరియు ప్రధాన ఆహార సంస్థల ప్రభావాన్ని పరిమితం చేయడానికి ప్రపంచ దేశాలు సహకరించాలని నిపుణులు కోరారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించాలని, తాజా ఫుడ్ ను తీసుకోవడం ద్వారా ఇలాంటి దుష్ఫ్రభావాలకు దూరంగా ఉండవచ్చని నిపుణులు సూచించారు.
తాజా వార్తలు
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్‌కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్‌ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సార్థక్..!!







