4 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ క్లోజ్..!!

- December 04, 2025 , by Maagulf
4 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ క్లోజ్..!!

కువైట్: కువైట్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ ను నాలుగు రోజులపాటు మూసివేయనున్నట్లు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఇంజనీర్స్ అసోసియేషన్ ఇంటర్ సెక్షన్ నుండి అమిరి హాస్పిటల్ ఇంటర్ సెక్షన్ వరకు ఉన్న అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్‌ను గురువారం సాయంత్రం 6:00 గంటల నుంచి ఆదివారం ఉదయం 6:00 గంటల వరకు పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనుల కోసం ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నట్లు తెలిపింది. ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com