‘అరబ్ గవర్నమెంట్ ఎక్సలెన్స్ అవార్డు’ అందుకున్న ఒమన్..!!

- December 05, 2025 , by Maagulf
‘అరబ్ గవర్నమెంట్ ఎక్సలెన్స్ అవార్డు’ అందుకున్న ఒమన్..!!

కైరో: ఒమన్ ఆర్థిక మంత్రి సుల్తాన్ బిన్ సలీం అల్ హబ్సీ "అరబ్ గవర్నమెంట్ ఎక్సలెన్స్ అవార్డు" అందుకున్నారు.  కైరోలోని అరబ్ లీగ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన "ఉత్తమ అరబ్ మంత్రి"గా సత్కారం అందుకున్నారు.

ఈ అరుదైన గౌరవం సుల్తాన్ హైతం బిన్ తారిక్ నాయకత్వంలో ఒమన్ ప్రభుత్వ రంగంలో సాధించిన మెరుగైన పనితీరును ప్రతిబింబిస్తుందని ఈ సందర్భంగా అల్ హబ్సీ తెలిపారు.  ఈ గుర్తింపు తమ బాధ్యతను రెట్టింపు చేసిందన్నారు. వినూత్నమైన భవిష్యత్ ను నిర్మించడానికి, అదే సమయంలో అరబ్ దేశాలతో మరింత సహకారానికి దోహదపడుతుందని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com