బహ్రెయిన్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన షేక్ మొహమ్మద్..!!
- December 05, 2025
మనామా: హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా రాస్ హయాన్‌లోని హెరిటేజ్ విలేజ్‌లో బహ్రెయిన్ ఫెస్టివల్ ఐదవ ఎడిషన్‌ను ప్రారంభించారు. ఏటా దీనిని సమాచార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. అంతకుముందు షేక్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కు సమాచార శాఖ మంత్రి డాక్టర్ రంజాన్ బిన్ అబ్దుల్లా అల్ నోయిమి స్వాగతం పలికారు.
ఈ ఫెస్టివల్ బహ్రెయిన్ అనేక రంగాలలో సాధించిన విజయాలను ప్రతిబింబిస్తుందని, అభివృద్ధిని ముందుకు నడిపించడంలో ప్రజల అంకితభావాన్ని హైలైట్ చేస్తుందని షేక్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అన్నారు. ఈ వేడుకలు హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా దార్శనికతకు అనుగుణంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జాతీయ గుర్తింపును కాపాడుకోవడంలో మరియు బహ్రెయిన్ చరిత్ర, భవిష్యత్తు పురోగతి గురించి యువతరానికి అవగాహన కల్పించడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు.
అనంతరం సాంస్కృతిక, వారసత్వ ప్రదర్శనలు, సాంప్రదాయ చేతిపనులు మరియు స్థానిక ఉత్పత్తులను ప్రదర్శించే మార్కెట్ ను సందర్శించారు. ఈ సంవత్సరం డిసెంబర్ 28 వరకు ఫెస్టివల్ జరుగుతుంది. ఇంటరాక్టివ్ సెషన్లు, వారసత్వ వర్క్‌షాప్‌లు మరియు కుండలు, సాంప్రదాయ ఓడ నమూనా నిర్మాణం, వస్త్ర పనిలో శిక్షణా సెషన్‌లను నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- డైమండ్ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన ఖతార్..!!
- సౌదీలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- ఇండిగో సంక్షోభం కంటిన్యూ..డొమెస్టిక్ సర్వీసెస్ క్యాన్సిల్..!!
- స్పెషల్ అట్రాక్షన్.. అల్-మసీలా బీచ్‌లో ఫియస్టా సిటీ..!!
- బహ్రెయిన్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన షేక్ మొహమ్మద్..!!
- ‘అరబ్ గవర్నమెంట్ ఎక్సలెన్స్ అవార్డు’ అందుకున్న ఒమన్..!!
- ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు
- అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
- తిరుమలలో కీలక మార్పులు...
- పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ







