ఇండిగో సంక్షోభం కంటిన్యూ..డొమెస్టిక్ సర్వీసెస్ క్యాన్సిల్..!!

- December 05, 2025 , by Maagulf
ఇండిగో సంక్షోభం కంటిన్యూ..డొమెస్టిక్ సర్వీసెస్ క్యాన్సిల్..!!

న్యూఢిల్లీ: భారత్ లో ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. డిసెంబర్ 5 మిడ్ నైట్ వరకు డొమెస్టిక్ సర్వీసులను రద్దు చేసినట్లు ఢిల్లీ, ముంబాయి ఎయిర్స్ పోర్ట్స్ వెల్లడించాయి. దీంతో దేశీయంగా రాకపోకలను తీవ్రంగా ప్రభావితం చేసిందని ట్రావెల్ ఏజేన్సీలు తెలిపాయి.

డిసెంబర్ 5న ఢిల్లీ విమానాశ్రయం నుండి బయలుదేరే ఇండిగో దేశీయ విమానాలు అర్ధరాత్రి వరకు రద్దు చేసినట్లు, అన్ని ఇతర క్యారియర్‌ల కార్యకలాపాలు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతున్నాయని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ తెలిపింది.  

మరోవైపు, ఢిల్లీ విమానాశ్రయం వైద్య సహాయం అవసరమైన ప్రయాణీకులు గ్రౌండ్ స్టాఫ్, హెల్ప్ డెస్క్ లేదా T3 డొమెస్టిక్ పియర్ జంక్షన్‌లోని సెల్ఫ్-మెడికేషన్ రూమ్, T2లోని పోస్ట్-సెక్యూరిటీ సెల్ఫ్-మెడికేషన్ రూమ్ మరియు T1లోని డిపార్చర్ మెడికల్ సెంటర్‌లోని వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించింది.

ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ప్రకారం, శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు చెన్నై ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరే అన్ని విమానాలను ఇండిగో రద్దు చేసింది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కూడా డిసెంబర్ 5న 104 వరకు ఇండిగో దేశీయ సర్వీసులను రద్దు చేసినట్టు ప్రకటించింది. 

అంతకుముందు రోజు సైతం 225 ఇండిగో సర్వీసులను రద్దు అయినట్లు ఢిల్లీ విమానాశ్రయం తెలిపింది.  మొత్తంగా 500 కి పైగా ఇండిగో సర్వీసులను రద్దు చేశారు. దీంతో దేశీయ ప్రయాణికుల రాకపోకలను తీవ్రంగా ప్రభావితం చేశాయని ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ప్రయాణికులు ఇబ్బందులు పడినట్లు తెలిపారు.  ప్రయాణీకులు విమానాశ్రయానికి రాకముందే వారి ఫ్లైట్ సర్వీస్ స్టేటస్ ను చెక్ చేసుకోవాలని సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com