స్పెషల్ అట్రాక్షన్.. అల్-మసీలా బీచ్‌లో ఫియస్టా సిటీ..!!

- December 05, 2025 , by Maagulf
స్పెషల్ అట్రాక్షన్.. అల్-మసీలా బీచ్‌లో ఫియస్టా సిటీ..!!

కువైట్: కువైట్ టూరిజం ప్రాజెక్ట్స్ కంపెనీ అల్-మసీలా బీచ్‌లో తన తాజా “ఫియస్టా సిటీ”ని ప్రారంభించింది. ఇది పెద్ద సంఖ్యలో పెద్దలు, పిల్లలను ఆకర్షిస్తోందని,  20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినట్లు ప్రారంభోత్సవ సందర్భంగా ప్రాజెక్ట్ మేనేజర్ అష్రఫ్ మకరేమ్ తెలిపారు.

“ఫియస్టా సిటీ”లో ఐదు విభిన్న జోన్‌లు ఉన్నాయని..  వీటిలో ఆర్ట్స్ ఏరియాతోపాటు  డైనోసార్ వరల్డ్, స్పోర్ట్స్ జోన్, డైలీ ఎగ్జిబిషన్స్ నిర్వహించే ఓపెన్ థియేటర్ మరియు ఒక స్మాల్ సైజ్ జూ సందర్శకులకు మంచి పర్యాటన అనుభవాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.  ఎంట్రీ టిక్కెట్ల ధర 5 దినార్లు అని, అన్ని కార్యకలాపాలతో సహా, ఐదు గంటల రోజువారీ స్టేజ్ షోలను ఆస్వాదించవచ్చని మకరేమ్ వివరించారు. ఈ ప్రాజెక్ట్ నాలుగు నెలల పాటు సందర్శకులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com