సౌదీలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- December 05, 2025
రియాద్: సౌదీలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఇవి డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 11 వరకు కొనసాగుతాయని నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ (NCM) వెల్లడించింది. అసిర్, అల్-బహా, మక్కా, మదీనా, తబుక్, హైల్, ఖాసిమ్, జాజాన్, అల్-జౌఫ్, ఉత్తర సరిహద్దులు, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
అదే సమయంలో దుమ్ము తుఫానులకు కారణమయ్యే చురుకైన డౌన్‌డ్రాఫ్ట్‌లు, కొన్ని ప్రాంతాలలో వడగళ్ళు, ఎర్ర సముద్రం మరియు అరేబియా గల్ఫ్‌లో అధిక అలల తీవ్రత ఉంటుందని తెలిపింది. భారీ వర్షపాతం కారణంగా లోయలు మరియు లోతట్టు ప్రాంతాలలో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
వాతావరణ అప్డేట్ లను నిరంతరం చెక్ చేసుకోవాలని, ప్రయాణం సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వాతావరణ కేంద్రం వెబ్‌సైట్, సోషల్ మీడియా ఛానెల్‌లు మరియు అన్వా యాప్ నుండి అధికారిక సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలని కోరింది.
తాజా వార్తలు
- డైమండ్ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన ఖతార్..!!
- సౌదీలోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- ఇండిగో సంక్షోభం కంటిన్యూ..డొమెస్టిక్ సర్వీసెస్ క్యాన్సిల్..!!
- స్పెషల్ అట్రాక్షన్.. అల్-మసీలా బీచ్‌లో ఫియస్టా సిటీ..!!
- బహ్రెయిన్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన షేక్ మొహమ్మద్..!!
- ‘అరబ్ గవర్నమెంట్ ఎక్సలెన్స్ అవార్డు’ అందుకున్న ఒమన్..!!
- ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు
- అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
- తిరుమలలో కీలక మార్పులు...
- పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ







