బెర్లిన్ హాస్పిటల్ లో కాల్పులు

- July 26, 2016 , by Maagulf
బెర్లిన్ హాస్పిటల్ లో కాల్పులు

జర్మనీ రాజధాని బెర్లిన్‌లో కాల్పుల కలకలం రేగింది. బెర్లిన్‌ సమీపంలోని స్టెగ్లిట్జ్‌ ప్రాంతంలోని ఆస్పత్రిలోకి సాయుధుడైన దుండగుడు ప్రవేశించి కాల్పులు జరిపాడు. ఓ వైద్యుడిపై దాడి చేసి అతడిని తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వైద్యుడికి చికిత్స అందిస్తున్నారు. బెంజ్‌మన్‌ ఫ్రాంక్లిన్‌ క్యాంపస్‌లోని ఛారిటీ యూనివర్సిటీ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com