కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- December 09, 2025
కువైట్: కువైట్ లో కొత్తగా కఠినమైన మాదకద్రవ్యాల నిరోధక చట్టం డిసెంబర్ 15నుంచి అమల్లోకి రానుంది. దీనిని మాదకద్రవ్యాలకు వ్యతిరేక పోరాటంలో "భారీ ముందడుగు"గా పబ్లిక్ ప్రాసిక్యూషన్ అభివర్ణించింది. మరోవైపు, కొత్త చట్టంలోని ప్రధాన శిక్షలను హైలైట్ చేయడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని అధికారులు అవగాహన ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
మాదకద్రవ్యాల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో భారీ జరిమానాలను విధించనున్నారు. అదే సమయంలో అక్రమ రవాణాదారుల ఆర్థిక వనరులపై ఈ చట్టం దెబ్బకొడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన ప్రకటనలో తెలిపింది. గతంలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసుల్లో జీవిత ఖైదు వేసేవారని,ఇక కొత్త చట్టం ప్రకారం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, లావాదేవీలకు మరణశిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
2024తో పోలిస్తే ఈ సంవత్సరం మొదటి 11 నెలల్లో డ్రగ్స్ కేసుల సంఖ్య తగ్గిందని డ్రగ్స్ ప్రాసిక్యూషన్ అధిపతి తలాల్ అల్-ఫరాజ్ అన్నారు. గత సంవత్సరం ఇదే కాలంలో 3,251 కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం నవంబర్ చివరి వరకు 2,874 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 90 శాతం కేసుల్లో నిందితులు కోర్టులో దోషులుగా తేలారని, ఈ సంవత్సరం జప్తు చేయబడిన మాదకద్రవ్యాల మార్కెట్ విలువ KD 74 మిలియన్లు అని వివరించారు.
తాజా వార్తలు
- కువైట్లో నేడు క్లాసెస్ రద్దు..!!
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్







