సౌదీ అరేబియా ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలు..!!
- December 13, 2025
రియాద్: సౌదీ అరేబియాకు ఎయిర్ టాక్సీలు వస్తున్నాయి. ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ (VTOL) విమానాలలో ప్రపంచ అగ్రగామి అయిన US కంపెనీ ఆర్చర్ ఏవియేషన్‌తో సౌదీ అరేబియా ఒప్పందం కుదుర్చుకుంది. రియాద్‌లో జరిగిన కోమోషన్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
రియాద్ లో నెక్ట్స్ జనరేషన్ రవాణా కోసం రోడ్‌మ్యాప్‌తో అనుసంధానించబడిన అధునాతన వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి విస్తృత జాతీయ ప్రణాళికలో ఈ చర్య భాగమని తెలిపారు. అవగాహన ఒప్పందం ప్రకారం, సౌదీ అరేబియా మరియు ఆర్చర్ VTOL విమానాల కోసం రవాణా నియంత్రణ చట్టాలను అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఎయిర్ టాక్సీ సేవలను దశలవారీగా అమలు చేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కెప్టెన్ సులేమాన్ అల్-ముహైమీద్ తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!
- 14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- యూఏఈలో తొలి లైసెన్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్..!!
- ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..







