వెదర్ అలెర్ట్..ముసందమ్లో భారీ వర్షాలు..!!
- December 16, 2025
మస్కట్: అల్పపీడనం కారణంగా రాబోయే గంటల్లో ముసందమ్ గవర్నరేట్‌లో 20 నుండి 60 మిల్లీమీటర్ల వరకు భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనివల్ల వాడీలలో ఆకస్మాత్తుగా వరదలు సంభవించవచ్చని సివిల్ ఏవియేషన్ అథారిటీ హెచ్చరించింది. 15 నుండి 35 నాట్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ముసందమ్ గవర్నరేట్ తీరప్రాంతాలు మరియు ఒమన్ సముద్ర తీరాలలో 1.5 నుండి 2.0 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడతాయని పేర్కొంది.
ముఖ్యంగా అల్ బురైమి, నార్త్ అల్ బతినా మరియు సౌత్ అల్ బతినా గవర్నరేట్లలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములతో కూడిన వర్షాల సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, వాడీలను దాటవద్దని, లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని, హెచ్చరికల కాలంలో సముద్రంలోకి ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







