నవీన రాజకీయం గతి తప్పి అభివృద్ధికి అవరోధంగా మారుతున్న వేళ
- July 19, 2015
ఇటీవల కాలం లో మనం చూస్తున్న ఈ క్రొంగొత్త రాజకీయం అనేకానేక మలుపులు తిరుగుతూ ఆఖరికి ఇరు రాష్ట్రాల ప్రజల ను సందిగ్దావస్థ లో నెట్టి వేసింది. వాస్తవాస్తావాలు పక్కన పెడితే ఒక ముఖ్య విషయం పైన చర్చించవలసిన అవసరం ప్రాజ్నులైన వారికి వుంది.
నిజానికి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకత్వ వ్యవస్థ అధికారం లోకి వచ్చిన తరువాత కూడా ప్రలోభాల ద్వారా పరోక్షం గా వ్యక్తులను తమ వర్గం లో చేర్చుకుంటూ,తాము నిర్మించుకున్న పునాదులను మరింత బలోపేతం చేసుకోవడం, తమను విమర్శించే వారే వుండకూడదు అని మితిమీరిన ఆత్మ విశ్వాసం తో ప్రవర్తించడం సమర్ధనీయమా?
మరోపక్క తమ సిద్దాంత ప్రయోజనం కోసం ప్రజల బాగోగులు వదిలి అందని అరటి పండు కోసం అలవి మాలిన పనిని ప్రోత్సహించడం అనుభవజ్ఞుడైన నాయకులకు ఎంతవరకు సబబు ?
అయినా ఏదో చేస్తారని, చీకట్లో వున్నమా జీవితాలు బాగా ఉద్దరిస్తారని విశ్వసించి రెండు తెలుగు రాష్ట్రాల లోనూ స్పష్ట మైన సంఖ్యా బలం తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ప్రజలు వోటు వేస్తె, ప్రస్తుతం దాన్ని అపహాస్యం చేస్తూ అనైతిక మైన కార్యక్రమాలు చేస్తున్న ప్రస్తుత నేతలు క్షమార్హులు కారు, కాలేరు.
ఇప్పటికైనా జరిగిన సంఘటనలను నిష్పక్షపాతం గా చట్టానికి అప్పచెప్పి తమ తప్పులను వొప్పుకుని తిరిగి ప్రజలకు పట్టెడన్నం పెడితే అదే సంతోషం.మన తెలుగు వారు చాల మంచి వారు, అదే సమయం లో సున్నిత మనస్కులు, అందుకే పశ్చాతాప్త హృదయం తో వారి ముందు నిలిస్తే క్షమించి అక్కున చేర్చుకుంటారు. కనుక ఇరు రాష్ట్రాల అధినేతలు ఇప్పటికైనా సంయమనం పాటించి నిబద్దత తో వ్యవహరించి తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేయాలని కోరుకుంటూ ....
మీ ప్రవాస భారతీయుడు ( ఒక తెలుగు వాడు)
సుబ్రహ్మణ్య శర్మ(దుబాయ్)
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







