ఎంసెట్‌ను రద్దు చేయెద్దంటూ విజ్ఞప్తి..

- July 28, 2016 , by Maagulf
ఎంసెట్‌ను రద్దు చేయెద్దంటూ విజ్ఞప్తి..

తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రధాన ద్వారం ఎదుట ఎంసెట్‌-2 ర్యాంకర్లు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఎంసెట్‌ను రద్దు చేయెద్దంటూ ప్రభుత్వానికి విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎంసెట్‌-2 ప్రశ్నపత్రం లీకేజీ కేసు నివేదికను ఇవాళ సీఐడీ అధికారులు ప్రభుత్వానికి అందజేయనున్నారు. సీఐడీ నివేదిక ఆధారంగా నిర్ణయం ప్రకటిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఎంసెట్‌ ర్యాంకర్లు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com