అల్ ఐన్లో బార్బెక్యూ బ్యాన్..Dh4,000 వరకు ఫైన్..!!
- January 05, 2026
యూఏఈ: అల్ ఐన్లోని జెబెల్ హఫీట్లోని కొన్ని ప్రాంతాల్లో బార్బెక్యూ పై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు Dh4,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని డిపార్ట్మెంట్ ఆఫ్ మునిసిపాలిటీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ మరియు అల్ ఐన్ సిటీ మునిసిపాలిటీ వెల్లడించింది. ఈ మేరకు ద్వారా జెబెల్ హఫీట్లోని వివిధ పార్కింగ్ స్థలాల్లో పబ్లిక్ నోటీసులను అంటించారు.
జెబెల్ హఫీట్ నివాసితులు మరియు సందర్శకులలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రదేశాలలో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. సందర్శకుల కోసం వివిధ రకాల ఆహార మరియు పానీయాల అవుట్లెట్లు, ఇతర కుటుంబ-కేంద్రీకృత కార్యకలాపాలతో ఈ ప్రాంతం నిరంతరం అభివృద్ధి చేందింది.
డిసెంబర్ 2025లో, అరబ్ మరియు ప్రాంతీయ స్థాయిలో ఎమిరాటీ పర్యాటక ప్రదేశాల సంఖ్య పెరుగుతోంది. 2026కి అల్ ఐన్ను అరబ్ పర్యాటక రాజధానిగా ఎంపిక చేశారు. అరబ్ మినిస్టీరియల్ కౌన్సిల్ ఫర్ టూరిజం యొక్కఎగ్జిక్యూటివ్ ఆఫీస్ సిఫార్సు ఆధారంగా అల్ ఐన్ను ఎంపిక చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ ఫోటోగ్రఫీ సెంటర్ ఆధ్వర్యంలో 'సిటీ స్పీక్స్' ఎగ్జిబిషన్..!!
- నార్త్ బతినాలో ప్రవాసి హత్య..నిందితుడు అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో అక్రమ స్ట్రీట్ రేసింగ్.. ఇద్దరికి జైలుశిక్ష..!!
- జెడ్డాలో 9వేలమందికి హౌజింగ్ యూనిట్లు కేటాయింపు..!!
- కువైట్ లో జనవరి 9న నీటి సరఫరాకు అంతరాయం..!!
- యూఏఈలో పలు నెస్లే ఉత్పత్తుల రీకాల్..!!
- హెల్త్ కేర్..ప్రపంచంలోని టాప్ 20 దేశాలలో ఖతార్..!!
- మక్కాలో ఐదుగురు విదేశీయులు అరెస్ట్..!!
- యూఏఈలోని ఇండియన్ స్కూల్స్ రమదాన్ ప్రణాళికలు..!!
- కువైట్ లో ఇద్దరు భారతీయ ప్రవాసులకు మరణశిక్ష..!!







