రికాల్ నెస్లే బేబీ మిల్క్ ఉత్పత్తులపై ఒమన్ హెచ్చరిక..!!
- January 09, 2026
మస్కట్: సెరియులైడ్ అనే పదార్థంతో కలుషితమయ్యే అవకాశం ఉన్నందున, కొన్ని నెస్లే బేబీ మిల్క్ ఉత్పత్తులను రీకాల్ చేయడంపై ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పబ్లిక్ హెచ్చరికను జారీ చేసింది. ప్రభావిత ఉత్పత్తులను ఉపయోగించవద్దని మరియు అందించిన రీకాల్ జాబితాతో బ్యాచ్ నంబర్లను సరిచూసుకోవాలని పౌరులు, నివాసితులకు సూచించారు. ఒమన్‌లో ఈ ఉత్పత్తులకు సంబంధించిన ఎలాంటి అనారోగ్య కేసులు నమోదు కాలేదని, ముందు జాగ్రత్తగా అనుమానాస్పద వస్తువులను వెంటనే పారవేయాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక వాంతులు, వికారం లేదా కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో వైద్య సహాయం తీసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!
- కువైట్ లో దుమ్ముతో కూడిన గాలులు, చిరు జల్లులు..!!







