జబల్ షమ్స్‌లో జీరో కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదు..!!
- January 10, 2026
మస్కట్: జబల్ షమ్స్‌లో దేశంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత -2.2°C గా అధికారికంగా నమోదైంది. ఈ మేరకు ఒమన్ వాతావరణ కార్యాలయం తన తాజా నివేదికలో తెలిపింది. ఇది ప్రస్తుత వింటర్ సీజన్ లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత అని తెలిపింది.
అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలు గడ్డకట్టే స్థాయికి చేరుకున్నాయని, దక్షిణ గవర్నరేట్‌లు మాత్రం ఇంకా వేడి వాతావరణం ఉందని వెల్లడించింది. ఎత్తైన ప్రాంతాలు మరియు లోపలి ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయని, జబల్ షమ్స్ తర్వాత, సైక్‌లో 3.4°C కనిష్ట ఉష్వగ్రత నమోదైనట్లు పేర్కొంది. మఖ్షాన్ మరియు హైమాలో ఉష్ణోగ్రతలు 9°C నుండి 10°C మధ్య ఉన్నాయని తెలిపింది.
అల్ ధాహిరా మరియు అల్ బురైమి నివాసితులు తెల్లవారుజామున జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ బాగా తగ్గుతుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







