వాయిస్ ట్రాన్స్లేషన్, లిప్ సింక్‌తో ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్లు
- January 18, 2026
ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే వాయిస్ ట్రాన్స్లేషన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.ఈ ఫీచర్ ద్వారా ఒక భాషలో చేసిన రీల్స్‌ను తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ వంటి ప్రాంతీయ భాషల్లోకి సహజంగా అనువదించవచ్చు. మాటల భావం, టోన్ మారకుండా వినిపించడం దీని ప్రత్యేకత. దీనివల్ల క్రియేటర్ల కంటెంట్ మరింత మందికి చేరే అవకాశం ఏర్పడింది.
వాయిస్ ట్రాన్స్లేషన్తో పాటు లిప్ సింక్ ఫీచర్‌ను కూడా ఇన్స్టాగ్రామ్ (Instagram) అందుబాటులోకి తీసుకొచ్చింది. అనువదించిన భాషకు తగ్గట్టుగా వీడియోలోని పెదవుల కదలికలు ఆటోమేటిక్‌గా మ్యాచ్ అవుతాయి. దీంతో వీడియో చూస్తున్న వారికి డబ్బింగ్ చేసినట్టు కాకుండా సహజంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయ భాషల ప్రేక్షకులను చేరుకోవడంలో ఈ ఫీచర్ కీలకంగా మారనుంది.
ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు యూట్యూబ్ కూడా పిల్లల భద్రతపై దృష్టి పెట్టింది. పిల్లల కోసం షార్ట్స్ వీక్షణ సమయంపై పరిమితులు, నిద్ర సమయాన్ని గుర్తు చేసే బెడ్ టైమ్ రిమైండర్లు తీసుకొచ్చింది. అలాగే టీనేజర్లకు ఉపయోగపడే విద్యా సంబంధిత కంటెంట్‌ను ప్రోత్సహించేందుకు క్రియేటర్ గైడ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా సోషల్ మీడియా వినియోగం మరింత బాధ్యతాయుతంగా మారనుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!
- ఎన్టీఆర్‌కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు







