CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు
- January 18, 2026
విశాఖపట్నం: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2026 సీజన్‌ను Telugu Warriors ఘనంగా ఆరంభించింది. శనివారం విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో *Punjab De Sher* పై 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ Akhil Akkineni అజేయ సెంచరీతో మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలిచాడు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అఖిల్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడి 56 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి అశ్విన్‌బాబు 60 పరుగులతో చక్కటి సహకారం అందించాడు.
185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ దే షేర్ (Akhil Akkineni century) జట్టు తెలుగు వారియర్స్ బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. కరణ్‌వాణి (56) మినహా ఇతర బ్యాటర్లు విఫలమవడంతో జట్టు 18.2 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వినయ్ మహదేవ్ మూడు వికెట్లు, సామ్రాట్ రెండు వికెట్లతో కీలక పాత్ర పోషించారు.

తాజా వార్తలు
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!
- ఎన్టీఆర్‌కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు







