ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!

- January 18, 2026 , by Maagulf
ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!

మనామా: బహ్రెయిన్ లో  దారి దోపిడీ సంఘటన నమోదైంది. ఒక టాక్సీ డ్రైవర్‌ను రోడ్డుపై ఆపిన ఒక వ్యక్తి..  బలవంతంగా వాహనంలోకి ప్రవేశించి, డ్రైవర్ ను రాయితో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అతని వద్ద ఉన్న సెల్ ఫోన్,  BD220 నగదు తీసుకెళ్లిపోయాడు. బాధితుడి ఫిర్యాదులో కేసు నమోదైంది. ఈ కేసును హై క్రిమినల్ కోర్టు విచారణ చేపట్టింది.

నిందితుడు రాయితో కొట్టడంతో డ్రైవర్ తలకు బలమైన గాయం ఏర్పడిందని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు.  ఈ మేరకు దాడికి సంబంధించిన వీడియో క్లిప్‌ ను సమర్పించారు. ప్రాసిక్యూషన్ ఆ వ్యక్తిపై దొంగతనం అభియోగం మోపింది. కాగా, ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు..ఫిబ్రవరి 24న తుదితీర్పు ప్రకటిస్తామని వాయిదా వేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com