ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్‌మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!

- January 19, 2026 , by Maagulf
ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్‌మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లా ఏదులాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం, జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమై జిల్లాలో కొనసాగుతున్న పనులపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా పాలేరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన సీఎం, రాష్ట్ర ప్రభుత్వం వైద్యం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా వంటి దేశాల్లో నర్సింగ్ విద్యార్థులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ అవకాశాలను తెలంగాణ విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం ప్రత్యేకంగా భాషా శిక్షణ కార్యక్రమాలను అందిస్తోందని తెలిపారు.

‘ప్రజా పాలన–ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా పాలేరు (Khammam development) ప్రభుత్వ నర్సింగ్ కళాశాలతో పాటు కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రిని సీఎం ప్రారంభించారు. అలాగే మద్దులపల్లిలో కొత్త మార్కెట్ యార్డును కూడా ప్రజలకు అంకితం చేశారు. మున్నేరు–పాలేరు అనుసంధాన కాలువ, జేఎన్టీయూ కళాశాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం ద్వారా ఖమ్మం జిల్లా అభివృద్ధికి మరింత వేగం అందుతుందని సీఎం పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com