ఒరాకిల్, క్లౌడ్ సాప్ట్ వేర్ కంపెనీ నెట్ సూట్ ను కొనుగోలు!
- July 28, 2016
ప్రపంచ డేటా బేస్ విపణిలో సింహభాగాన్ని ఆక్రమిస్తున్న సాప్ట్ వేర్ దిగ్గజం ఒరాకిల్, క్లౌడ్ సాప్ట్ వేర్ కంపెనీ నెట్ సూట్ ను భారీ మొత్తంలో కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ డీల్ విలువ 9.3 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.62,407కోట్లు)గా వెల్లడించింది. వేగవంతంగా పెరుగుతున్న క్లౌడ్ మార్కెట్ లో తన బిజినెస్ లను విస్తరించడానికి ఈ డీల్ కుదుర్చుకున్నట్టు తెలిపింది.ఈ కొనుగోలు డీల్ తో నెట్ సూట్ షేర్లు ఒక్కసారిగా 18.6శాతానికి ఎగిసి, అంతర్జాతీయంగా ప్రీమార్కెట్ ట్రేడింగ్ లో 108.64 డాలర్లుగా రికార్డు అయ్యాయి. అదేవిధంగా ఒరాకిల్ షేర్లు సైతం 1.6శాతం పెరిగి, ప్రీమార్కెట్ ట్రేడింగ్ లో 41.3డాలర్లుగా నమోదయ్యాయి.ఈ అగ్రిమెంట్ ప్రకారం నెట్ సూట్ ఒక్క షేరుకు ఒరాకిల్ 109 డాలర్లను చెల్లించనుంది.ఒరాకిల్, నెట్ సూట్ రెండు సంస్థలు మార్కెట్ ప్లేస్ లో దీర్ఘకాలం కలిసి పనిచేస్తాయని ఒరాకిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ హర్డ్ తెలిపారు. సాప్ట్ వేర్ దిగ్గజంగా ఉన్న ఒరాకిల్ తో ఈ డీల్ కుదుర్చుకోవడం, తమ క్లౌడ్ సొల్యూషన్లు చాలా పరిశ్రమలకు, దేశాలకు విస్తరిస్తాయని నెట్ సూట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాచ్ నెల్సన్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఒరాకిల్ లో జాయిన్ అవ్వడం చాలా గర్వంగా భావిస్తున్నామని, తమ నూతనావిష్కరణలు పెంచుకుంటామని తెలిపారు. తన ప్రత్యర్థులు ఎస్ఏపీ ఎస్ఈ, మైక్రోసాప్ట్ కార్పొరేషన్ లకు పోటీగా ఒరాకిల్ క్లౌడ్ బేస్డ్ మోడల్ లపై తన బిజినెస్ లను మరల్చాలని కంపెనీ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒరాకిల్, నెట్ సూట్ ను కొనుగోలు చేయబోతుందని పేర్కొంది. 1998లో నెట్ సూట్ ను స్థాపించారు. క్లౌడ్ కంప్యూటింగ్ రెవల్యూషన్ లో నెట్ సూట్ ముందంజలో ఉంది.ఇంటర్నెట్ ద్వారా బిజినెస్ అప్లికేషన్లు అందించడంలో ఈ కంపెనీనే మొదటిది. క్లౌడ్ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచడానికి ఒరాకిల్ ఇప్పటికే టెక్స్టురా, ఓపవర్ వంటి కంపెనీలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









