రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- January 20, 2026
రియాద్: రియాద్ సీజన్‌కు సందర్శకుల సంఖ్య 14 మిలియన్లకు చేరుకుందని జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ (GEA) బోర్డు ఛైర్మన్ తుర్కి అల్-షేక్ ప్రకటించారు. రియాద్ సీజన్ అందించే కంటెంట్ అన్ని వయసుల వారి ఆసక్తులను ఆకర్షించడానికి రూపొందించిన సమగ్ర ప్రయాణాన్ని అందిస్తుందని అల్-షేక్ తెలిపారు.
ఇటీవల నిర్వహించిన "ఎ నైట్ ఆఫ్ హానర్ అండ్ హీరోస్".. రాయల్ మెరైన్స్‌తో కూడిన ప్రీమియం ఆర్కెస్ట్రా అనుభవాన్ని అందించిందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విజిటర్స్ ను ఆకర్షించేందుకు నిరంతరం వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తూనే ఉంటామని అల్-షేక్ స్పష్టం చేశారు. ఇది రియాద్ ప్రపంచంలో ప్రధాన వినోద గమ్యస్థానంగా తన స్థానాన్ని బలోపేతం చేసే సమగ్ర ప్రణాళిక వ్యవస్థలో భాగంగా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రస్తుత రియాద్ సీజన్ లో బౌలేవార్డ్ సిటీ విజిటర్స్ ను విపరీతంగా ఆకర్షిస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో విజిటర్స్ ను ఆకర్షించేలా మరింత వినూత్నంగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అల్-షేక్ వెల్లడించారు.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







