'తానా' అధ్యక్షులు శ్రీ సతీష్ వేమన గారికి అభినందన సభ

- July 20, 2015 , by Maagulf
'తానా' అధ్యక్షులు శ్రీ సతీష్ వేమన గారికి అభినందన సభ

దుబాయ్ లోని తెలుగు ప్రముఖులు శ్రీ ఎల్.అజిత్ కుమార్ గారు మరియు రసమయి తెలుగు అసోసియెషన్, దుబాయ్ వారి సహకారంతో, TANA  అధ్యక్షులు శ్రీ సతీష్ వేమన గారికి అభినందన సభ ఏర్పాటుచేశారు. ఇక్కడి ప్రముఖ వ్యాపారవేత్తలు, సాంకేతిక మరియు ఐ. టి. నిపుణులు ఈ సభలో పాల్గొని సాంస్కృతిక అవగాహన పెంపొందించేందుకు,ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు NRI లకు సహాయపడేందుకు అవసరమైన చర్యలను గూర్చి వారి విలువైన అభిప్రాయాలను వెల్లడించారు. భవిష్యత్తులో తెలుగు సంస్కృతి వైభవాన్ని వ్యాప్తిచేసేందుకు రెండు  సంఘాలు కలసి పనిచేయాలనే రసమయి జనరల్ సెక్రటరీ శ్రీమతి కృష్ణవేణి పంతాల గారి  ఆలోచనను అందరు హర్షించారు. ఈవిధమైన దిగ్గజాల కలయిక, అంతర్జాతీయంగా మంచి విలువైన కార్యక్రమాలను చేపట్టగలవని, తెలుగువారి స్థాయిని పెంచగలవని రసమయి అధ్యక్షులు శ్రీ రాజు పొట్రు గారు వాకృచ్చారు.

 

--సి.శ్రీ(దుబాయ్)

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com