NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు

- January 24, 2026 , by Maagulf
NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు

బహ్రెయిన్: తెలుగుదేశం పార్టీ యువనేత, రాష్ట్ర ఐటీ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఎన్‌ఆర్‌ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గల్ఫ్ కౌన్సిల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కన్వీనర్ రాధాకృష్ణ సమన్వయంతో, ఏపీఎన్‌ఆర్టీ అధ్యక్షులు డా.వేమూరి ఆధ్వర్యంలో ప్రత్యేక జూమ్ సమావేశం నిర్వహించబడింది. ఈ జూమ్ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, ఎంఎస్‌ఎంఈ, ఎస్‌ఈఆర్‌పీ మరియు ఎన్‌ఆర్‌ఐ ఎంపవర్‌మెంట్ & రిలేషన్స్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని ఎన్‌ఆర్‌ఐలతో సాన్నిహిత్యంగా మమేకమయ్యారు.

అనంతరం ఎన్‌ఆర్‌ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ బహ్రెయిన్ నాయకులు రఘునాథ్ బాబు,హరి బాబు,సతీష్ శెట్టి,రామ మోహన్,శివ కుమార్,సతీష్,ఇంతియాజ్ అహ్మద్,చంద్రబాబు,కిషోర్,అనిల్ పి,నాగార్జున,వాసు దేవ రావు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com