గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!

- January 24, 2026 , by Maagulf
గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!

దోహా: 2026లో పర్యాటక నగరాల్లో మొబైల్ ఇంటర్నెట్ పనితీరులో దోహా ప్రపంచ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు మొబైల్ డేటా స్పెషలిస్టు హోలాఫ్లీ అధ్యయనం తెలిపింది.   ప్రముఖ పర్యాటక కేంద్రాలలో సగటు స్థానిక మొబైల్ ఇంటర్నెట్ వేగాన్ని ఉపయోగించి 1-గిగాబైట్ నగర మ్యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ఎంత సమయం పడుతుందో పరిశోధకులు లెక్కించారు.  

దోహా సగటు మొబైల్ డౌన్‌లోడ్ వేగం 354.5 Mbps తో.. గిగాబైట్ మ్యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి 3 సెకన్ల కంటే తక్కువ సమయం పట్టింది. దుబాయ్ మరియు అబుదాబి సిటీలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ఇక ర్యాంకింగ్‌లో అట్టడుగున హవానా, క్యూబా ఉందని, ఇక్కడ సగటు వేగం 4 Mbps కంటే కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల 1 GB మ్యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి దాదాపు నాలుగు నిమిషాలు పడుతుందని తెలిపింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com