RBI: ప్రభుత్వ ఖాతాలోకి లక్షల కోట్లు..సామాన్యులకు పన్ను ఊరట?

- January 28, 2026 , by Maagulf
RBI: ప్రభుత్వ ఖాతాలోకి లక్షల కోట్లు..సామాన్యులకు పన్ను ఊరట?

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) పాత్ర ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాలను రూపొందించుకునేటప్పుడు RBI ఇచ్చే డివిడెండ్ (మిగులు నిధులు) అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. రాబోయే 2027 ఆర్థిక సంవత్సరంలో (FY27) కూడా రిజర్వ్ బ్యాంక్ నుండి భారీ స్థాయిలో డివిడెండ్ అందవచ్చని ప్రముఖ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. సుమారు రూ.3 లక్షల కోట్ల వరకు ఈ డివిడెండ్ ఉండవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్న మాట. రూ. 3 లక్షల కోట్ల డివిడెండ్ సాధ్యమేనా? గత ఏడాది ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువగా రూ.2.11 లక్షల కోట్లు (మొత్తం ₹2.7 లక్షల కోట్లు) డివిడెండ్ లభించింది. ఇప్పుడు 2027 ఆర్థిక సంవత్సరానికి గాను ఇది రూ.3 లక్షల కోట్ల మార్క్ ను చేరుకుంటుందని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ఎస్‌బీసీ (HSBC) వంటి ప్రముఖ సంస్థలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వం పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కంటే RBI (RBI) ఇచ్చే ఈ డివిడెండ్ ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి కేంద్రానికి పెద్ద ఆసరాగా నిలుస్తుంది.

నిధుల బదిలీ పెరగడానికి కారణాలేంటి?
రిజర్వ్ బ్యాంక్ ఆదాయం పెరగడానికి, డివిడెండ్ పెరగడానికి కొన్ని కీలక అంశాలు దోహదపడుతున్నాయి.. ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ విక్రయాలు: డాలర్‌ తో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతున్న సమయంలో RBI తన వద్ద ఉన్న డాలర్లను విక్రయిస్తుంది. తక్కువ ధరకు కొన్న డాలర్లను ప్రస్తుత మార్కెట్ ధర (సుమారు రూ.91.72) వద్ద అమ్మడం ద్వారా భారీగా లాభాలను పొందుతుంది. విదేశీ పెట్టుబడులపై రాబడి: రిజర్వ్ బ్యాంక్ విదేశీ ఆస్తులపై చేసే పెట్టుబడుల ద్వారా వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం ఈసారి పెరిగే అవకాశం ఉంది. కంటింజెన్సీ రిస్క్ బఫర్ (CRB) తగ్గింపు: బ్యాంక్ తన అత్యవసర నిధుల పరిమితిని (CRB) 7.5% నుండి 5.5%కి తగ్గిస్తే.. మిగిలిన భారీ నిధులను ప్రభుత్వానికి డివిడెండ్‌ గా బదిలీ చేసే వీలుంటుంది. కేవలం 1% బఫర్ తగ్గినా సుమారు రూ.84,000 కోట్ల అదనపు నిధులు ప్రభుత్వానికి చేరే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com