సూర్య చిత్రంనికి '5.35' అనే పేరు ...

- July 29, 2016 , by Maagulf
సూర్య చిత్రంనికి  '5.35' అనే పేరు  ...

త మిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్‌ని సంపాదించుకొన్న కథానాయకుడు సూర్య. ఇటీవల '24'తో విజయాన్ని సొంతం చేసుకొన్న ఆయన ప్రస్తుతం 'సింగం 3'లో నటిస్తున్నారు. ఆ తర్వాత 'కబాలి' చిత్ర దర్శకుడు పా రంజిత్‌తో ఓ చిత్రం చేయబోతున్నారు. తమిళంతో పాటు, తెలుగులోనూ విడుదల కానున్న ఆ చిత్రానికి '5.35' అనే పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో సూర్య బాక్సర్‌గా కనిపించనున్నట్టు సమాచారం. '5.35' అనే పేరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదొక సైన్స్‌ఫిక్షన్‌ కథ అని మొదట ప్రచారం సాగినా బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com