నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

- February 05, 2026 , by Maagulf
నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

నైజీరియాలోని క్వారా రాష్ట్రంలో ఉన్న వోరో, నూక అనే రెండు గ్రామాలను ఉగ్రవాదులు చుట్టుముట్టారు. ఒక్కసారిగా సాయుధ దుండగులు గ్రామాల్లోకి చొరబడి ప్రజలను చుట్టుముట్టారు. దుండగులు గ్రామస్తుల చేతులను వెనక్కి విరిచి కట్టి, ఆపై కాల్చి చంపారు. ఈ దాడిలో దాదాపుగా 200 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కేవలం హత్యలు చేయడమే కాకుండా గ్రామాల్లోని ఇళ్లను, దుకాణాలకు నిప్పు పెట్టి కాల్చేశారు. ప్రాణభయంతో కొందరు ప్రజలు అడవుల్లోకి పరుగులు తీశారు. వీధుల్లో ఎక్కడ చూసినా కూడా శవాల దిబ్బలు కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్రంగా ఖండించింది.

గత ఐదు నెలలుగా దుండగులు గ్రామస్థులను హెచ్చరిస్తూ లేఖలు పంపుతున్నా, ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు తీసుకోలేదని ఆ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు భావిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల నైజీరియా సైన్యం ఉగ్రవాదులే లక్ష్యంగా జరిపిన ఆపరేషన్‌లో సుమారు 150 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. తమ వారిని చంపినందుకు ప్రతీకారంగానే సాయుధ ముఠాలు ఈ నరమేధానికి పాల్పడి ఉండవచ్చని క్వారా గవర్నర్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. అలాగే కాట్సినా రాష్ట్రంలో కూడా దుండగులు రెచ్చిపోయారు. అక్కడ జరిగిన దాడిలో మరో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com