'హై' మూవీ ఇంటెన్స్ టీజర్
- February 10, 2026
హిట్ మేకర్ అనిల్ రావిపూడి అసోసియేట్, అతని అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సహ రచయితగా పని చేసిన ఎస్ కృష్ణ 'హై' అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నటుడు , సహ నిర్మాతగా కూడా పనిచేస్తున్నారు. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్ పై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ఈ చిత్ర టీజర్‌ను విక్టరీ వెంకటేష్ ఈరోజు లాంచ్ చేశారు.
ఈ టీజర్ ఒక గ్రిప్పింగ్ ఆంథాలజీగా "హై"ని అర్థం చేసుకునే నలుగురు వ్యక్తులను ప్రజెంట్ చేసింది. ఒక అమ్మాయి తన జీవితాన్ని అంతం చేసుకోవడానికి ఒకరిని నియమించుకుంటుంది, మరొక వ్యక్తి మద్యంలో తన హై వెతుక్కుంటాడు, మరొక అమ్మాయి తన ఆత్మగౌరవాన్ని తిరిగి పొందడంలో తాను హై ఫీలౌతుంది ఆమె ప్రేమికుడు ప్రమాదకరమైన పందాల కాస్తాడు.
ఎస్ కృష్ణ ఒక బోల్డ్ కథని ఎమోషన్స్ తో కూడిన డ్రామాగా ప్రజెంట్ చేశారు. మొత్తం తారాగణం అద్భుతమైన పెర్ఫారమెన్స్ లతో ఆకట్టుకున్నారు.
సినిమాటోగ్రాఫర్లు మల్లు నాయక్, సునీల్ రెడ్డి గట్టి క్లోజప్‌లు, స్పీడ్ కట్లు , కలర్ పాలెట్‌ను వాడుకున్న తీరు ఆకట్టుకుంది. ఇవన్నీ అడ్రినలిన్-పంపింగ్ వైబ్రెన్సీని ఇచ్చాయి. సంగీత దర్శకుడు వికాసా పల్సేటింగ్ స్కోర్‌తో ఎమోషన్ ని మరింత ఎలివేట్ చేశారు. జిఆర్కె శరణ్ రావుల ఎడిటర్, వి వెంకట్ యాక్షన్ కోరియోగ్రఫీ అందిస్తున్నారు.
ఈ టీజర్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా టాకీ భాగం పూర్తయింది, పాటల చిత్రీకరణ పెండింగ్‌లో ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేస్తారు.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సాయి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. నా సినిమాలకు పనిచేస్తూ గ్యాప్ లో ఈ షూటింగ్ చేసేవాడు. ఒక బెస్ట్ ఫ్రెండ్ గా నా విషెస్ ఎప్పుడు తనకు ఉంటాయి. తను మంచి టెక్నీషియన్ గా ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఉండాలని కోరుకుంటున్నాను. తను యాక్టర్ గా కూడా సక్సెస్ఫుల్ అయ్యాడు. నాతో ఉన్నప్పుడు ఒక రకమైన సాయి ని చూశాను, తను సినిమా చేసిన తర్వాత మరొక సాయి కనిపించాడు. మంచి జడ్జిమెంట్ ఉన్న టెక్నీషియన్. ఒక కొత్త జానర్ లో డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో తీసిన సినిమా ఇది. ఆడియన్స్ చూసిన తర్వాత తన ప్రయత్నాన్ని కచ్చితంగా ఆదరిస్తారు. చాలా మంచి టెక్నిషన్స్ ఉన్నారు. మ్యూజికల్ గా కూడా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. హైదరాబాద్ లైవ్ లొకేషన్స్ లో ఈ సినిమా తీశారు. సినిమా డబుల్ పాజిటివ్ చూశాను. అద్భుతంగా వుంది. సాయి ఇలాంటి ఫ్రెండ్ ఉంటే లైఫ్ చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. తను చాలా ముక్కు సూటిగా ఉంటాడు. ఈ సినిమాకి హై అనే టైటిల్ పెట్టారు. అలాంటి హై అందరికీ రావాలి. అందరికీ థాంక్యు సో మచ్.
ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. అనిల్ తో పాటు సాయి తో కూడా మాకు జర్నీ ఉంది. స్క్రిప్ట్ విషయంలో సినిమా విషయంలో అనిల్ తో ఫైట్ చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి సాయి. ఇంత మందిని ఇంట్రడ్యూస్ చేయడం అనేది రియల్లీ హాట్సాఫ్. ఈ సినిమా అందరికీ హై రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ యాక్టర్ రైటర్ ప్రొడ్యూసర్ నాలుగు పాత్రలతో పరిచయం అవుతున్న సాయికి మరోసారి ఆల్ ది బెస్ట్.
ప్రొడ్యూసర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సాయి అనిల్ రియల్ ట్రూ ఫ్రెండ్స్. వెంకటేష్ తో సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళ వర్కింగ్ స్టైల్ చూశాను. సాయి చాలా పాషన్ పర్సన్. తన ప్రయత్నం తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. అందరికి బెస్ట్
యాక్టర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎస్ కృష్ణ మాట్లాడుతూ.. అందరికీ థాంక్యూ సో మచ్. ఈ సినిమా చూసే వాళ్ళకి మంచి హై ఇస్తుంది ఇందులో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ కెరీర్ లో రెండేళ్లు నాకు ఇచ్చారు. ఈ సినిమా తీయడానికి నాకు రెండేళ్లు పట్టింది. ఈ ప్రోడక్ట్ అందరికీ మంచి హై ఇస్తుందని నాకు గట్టి నమ్మకం. వికాస్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. టీజర్ చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఇంట్రెస్టింగ్ గా ఉండే మూవీ ఇది. ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు అందరికీ ఈ సినిమా మంచి ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా చూస్తున్నప్పుడు హైదరాబాదులో ఇన్ని రోడ్లు ఉన్నాయా అని ఫీల్ అవుతారు అన్ని లైవ్ లొకేషన్ లో షూట్ చేశాం. అలాగే క్రికెట్ ఆడే విధానం కూడా చాలా కొత్తగా ఉంటుంది. నాకోసం వచ్చిన అనిల్ గారికి సురేష్ బాబు గారికి, దిల్ రాజు గారికి థాంక్ యూ.
నిర్మాత హరీష్ పెద్ది మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఆడియన్స్ థియేటర్స్ లో చూస్తున్నప్పుడు కచ్చితంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ ఈవెంట్ లో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.
తారాగణం: అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు)
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ఎస్ కృష్ణ
నిర్మాతలు: హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల
బ్యానర్లు: ఇమేజ్‌స్పార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్
సంగీతం: వికాస బాదిసా
ఎడిటర్: GRK శరణ్ రావుల
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, సురేష్ బనిశెట్టి
సినిమాటోగ్రాఫర్లు: మల్లు నాయక్, సునీల్ రెడ్డి (సెకండ్ యూనిట్ DOP)
కొరియోగ్రాఫర్: శిరీష్ కుమార్
యాక్షన్: వి వెంకట్
సౌండ్ డిజైన్: ప్రదీప్ జి
కలరిస్ట్: ఆండ్రియాస్ బ్రూకెల్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మనాథ్ ఎ. పాటిల్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరీష్
లైన్ ప్రొడ్యూసర్: వి జానకి రామ్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
పబ్లిసిటీ డిజైన్స్: RC డిజైన్స్
మ్యూజిక్ లేబుల్: ఆదిత్య మ్యూజిక్
ఈవెంట్ పార్టనర్: Youwe Media
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్‌సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్‌లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









