మస్కట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు
- July 30, 2016గత కొన్ని రోజులుగా తక్కువ ఉష్ణోగ్రతలు మస్కట్లో నమోదు కాగా, ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇక నుంచి ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్కి పైగానే ఉంటాయని, తీర ప్రాంతాలతో పోల్చితే మిగతా ప్రాంతాల్లో ఈ ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం మస్కట్లో 32 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. వచ్చే వారం 29 నుంచి 34 డిగ్రీల వరకు ఉండనుంది. ఈ ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆదివారం నాటికి ఉష్ణోగ్రతల్లో 3 నుంచి 5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం కూడా ఉంది. వాతావరణం ఇప్పటివరకూ బాగానే ఉన్నా ముందు ముందు పెరిగే అవకాశముందన్న హెచ్చరికలతో అప్రమత్తమవుతున్నట్లు మస్కట్ వాసులు అంటున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







